TG: రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ‘చేనేత కార్మికులకు రుణామాఫీ పథకం’ కింద విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హ్యాండ్లూమ్స్ మరియు అప్పారెల్ ఎక్స్పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.