TPT: ఫేస్బుక్లో ‘వైష్ణవ యాత్రాస్’ పేరిట ప్రభాకరాచార్యులు ఓ పేజీ నడుపుతున్నారు. శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టిక్కెట్లు ఇస్తామంటూ అతను ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు తెలిపింది.