BDK: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై వైద్యులను సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..సమాజంలో వైద్యుల సేవలు అపూర్వమైనవి, వారు నిరంతరం ప్రజాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అహర్నిశలు కృషి చేయాలని కోరారు.