MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానికులు వైద్యులను శాలువా పూలమాలతో సన్మానించారు. ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్లు చేసే సేవ మరువలేనిదని అన్నారు. అన్ని వృత్తుల కెల్లా వైద్య వృత్తి పవిత్రమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ మోహన్, రంగయ్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.