KNR: కరీంనగర్ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ..నగరంలో అత్యాధునిక కెమెరాల సహాయంతో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. నిబంధనలు పాటించని వాహనదారులను ఈ కెమెరాలు ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయని, వాహన యజమానులపై ట్రాఫిక్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.