ప్రకాశం: సీఎస్‌పురం పట్టణంలో ఈనెల 30వ తేదీ నుంచి జూన్ 5 వరకు రాచూరి పెద్దమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా సోమవారం పామూరు సీఐ భీమా నాయక్ పట్టణంలోని వివిధ సామాజిక వర్గాల నాయకులతో ఆలయ కమిటీ సభ్యులతో, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తిరునాళ్లలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సంతోషకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని కోరారు.