SRD: మద్యం తాగి వాహనాల నడిపితే చర్యలు తప్పవని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కంగ్టిలోని బోర్గి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనాల తనిఖీతో పాటు, ప్రతి వాహనదారుడికి బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.