మన్యం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో చేపట్టే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని ప్రాజెక్ట్ అధికారి అసూతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబరులో డ్వామా సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి హామీలో ఉద్యానవన మొక్కల పెంపకం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు.