SDPT: హామాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం బంకచర్లపల్లిలో గల పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు హమాలీలా కొరత ఉందని కొనుగోలు నిర్వాహకులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.