PLD: చిలకలూరిపేటలో జరిగిన నాటక పోటీల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, గత పాలకుల చేతగాని పరిపాలన వల్లనే రాష్ట్రం, ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న చిలకలూరిపేటకు అవలక్షణాలు అంటించిన ఘనత వారికే దక్కుతుందన్నారు. కేసులు, కక్ష సాధింపులు, అవినీతితో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.