మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో హరితహారంపై కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఆధ్వర్యంలో హరితహారంలో డిపార్ట్మెంట్ శాఖల వారిగా నాటాల్సిన మొక్కలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని సూచించారు.