AP: ప్రభుత్వం జూన్1 నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్లు నిలుపుదల చేయనుంది. ఇక నుంచి రేషన్ షాపుకి వెళ్లి బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది అనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు.