PLD: ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి మోదీ దేశ శక్తిని ప్రపంచానికి చాటారని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో ఎన్డీఏ చర్యలకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ అండగా నిలిచారని తెలిపారు. చిలకలూరిపేటలో జరిగిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 26 మంది మృతికి ప్రతిగా భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టడం గర్వకారణమన్నారు.