సత్యసాయి: మడకశిర పట్టణంలో సోమవారం మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్నారు. కార్యకర్తలే పార్టీకి శ్రీరామరక్ష అని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.