KRNL: నిర్దేశించిన సమయంలోపు అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతి పత్రాలను డీఆర్ఏ వెంకట్ నారాయణమ్మతో కలిసి ఆయన స్వీకరించారు. అధికారులు గ్రామస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.