KRNL: ఆదోని పట్టణంలో వెలసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 93వ రథోత్సవం సందర్భంగా సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారకి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.