SKLM: మందస మండలం బుడార్సింగి గ్రామానికి చెందిన అరిక ఢిల్లేశ్వరి సోమవారం పురిటి నొప్పులతో బాధ పడుతూ… 108లో హాస్పిటల్కి తీసుకొని వెళుతుండగా మార్గం మధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఈ.యం.టి. గోపాలకృష్ణ డెలివరీ చేయగా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డలను క్షేమంగా హరిపురం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చారు.