ASR: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కొరకు మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని డుంబ్రిగుడ ఎంపీడీవో ప్రేమ్ సాగర్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో మండల ప్రజలు పాల్గొని ఫిర్యాదులు అందించాలని తెలియజేశారు.