TG: మాచారంలో CM రేవంత్ నల్లమల్ల డిక్లరేషన్ను ఆవిష్కరించారు. దీనిద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం, గిరిజనులకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బంజారా, చెంచు తెగల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.