మేడ్చల్: ఉప్పల్ నుంచి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు RTC అధికారులు తెలియజేశారు. మే 26 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకు వస్తే కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే బస్సులు ఎక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు.