VZM: ధర్మపురిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో జెడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సోమవారం సమావేశం నిర్వహించారు. మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు పై దృష్టి సారించాలని సూచించారు. కమిటీల్లో 10 శాతం మహిళలు ఉండేలా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.