SRPT: కోదాడ మండలం రెడ్లకుంట సమీపంలో రూ.38.31కోట్లతో నిర్మాణం చేస్తున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్, రైతులతో సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నాటికి రెడ్ల కుంట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.