NRML: సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ అన్నారు. సోమవారం జన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వారు స్వీకరించారు. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్జీదారులు పాల్గన్నారు.