MHBD: మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఈరోజు ఏకగ్రీవంగా జరిగింది. సోమవారం ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా నాగేందర్, అధ్యక్షులుగా శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి మహేందర్ ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారి శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షులుగా తప్పెట్ల సురేష్, బానోత్ ప్రవీణ్, నాగరాజు, మరికొంతమంది సభ్యులుగా ఎన్నికయ్యారు.