NZB: ఈనెల 5 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం మొత్తం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమల పూడి రవికుమార్ మీడియాకు తెలిపారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 8 మంది సిట్టింగ్ స్క్వాడ్లు, 1 హైపవర్ కమిటీ ఉన్నారు.