WNP: జిల్లాల్లో గృహావసరాలకు LPG సిలిండర్లకు గాని పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదనీ ప్రజలు వదంతులు నమ్మి ప్రస్తుత అవసరం లేకున్న ముందస్తు కొనుగోలుకు ప్రయత్నం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటనలో తెలిపారు. సిలిండర్ల సరఫరా పెంచడం జరిగిందన్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, గ్యాస్ సిలిండర్లు,పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి లోటు లేదన్నారు.
BHPL: జిల్లాలో డ్రగ్స్ సేవించి వాహనాలు నడిపే వారిని సులభంగా గుర్తించి చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రూపొందించిన ‘యూరిన్ కప్ టెస్ట్’ ద్వారా గంజాయి, కొకైన్‌తో సహా 11 రకాల మత్తు పదార్థాలను ఒక్కసారిగా గుర్తించవచ్చు. డ్రగ్స్ రహిత జిల్లాగా BHPLని తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.
BDK: సేవ్ సింగరేణి జాత కార్యక్రమంలో భాగంగా మణుగూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. సింగరేణి సంస్థను రక్షించాలని, కార్మికుల హక్కులను కాపాడాలని, ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించగా, సీతారామచంద్రస్వామి విగ్రహాలను వధూవరులుగా ముస్తాబు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరుగుతున్న ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్-అపర్ణ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
GDWL: ఇటిక్యాలలో జరుగుతున్న పంటల సర్వేను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే యాప్ వినియోగాన్ని తనిఖీ చేస్తూ, రైతులను సంప్రదించి సాగు వివరాలు, ఖాళీ భూముల (Waste land) డేటాను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. డేటా సేకరణలో పారదర్శకత పాటించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
KMM: ముదిగొండ మండలం గందసిరి-వల్లాపురం రహదారి సమీపంలో శుక్రవారం మొక్కజొన్న కోస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MLG: మంగపేట మండల కేంద్రంలో ఇవాళ మన్య సీమ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు నాగరాజ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రతినిధులు ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ సంఘంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వివాదంపై చేస్తున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
SRD: పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రఖ్యాత శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవంలో పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
HNK: హన్మకొండ మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి కార్యాలయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామనవమి పర్వదినం మన భారతీయ సనాతన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
VKB: బంట్వారం మండల కేంద్రంలో అండర్ డ్రైనేజ్ పైప్‌లైన్ పనుల కోసం తవ్విన మట్టి, రాళ్లు కొంతకాలంగా రోడ్డుపై పేరుకుపోయి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యను గమనించిన మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, స్వయంగా ముందుండి మట్టి, రాళ్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో రహదారి సాఫీగా మారి వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
JN: జాఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లెలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని భక్తులు ఆకాంక్షించారు.
KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 21.5 అడుగులకు చేరింది. సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలకు నీరు పుష్కలంగా ఉండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై వెళ్తున్న భారీ వాహనానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం రేండ్లగూడ ప్రధాన రహదారిపై వెళ్తున్న భారీ ట్రక్కుకు అక్కడి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని అక్కడే నిలిపివేశారు. స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి భారీ టక్కుకు ప్రమాదం కాకుండా చూశారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం బయానా గుట్ట సమీప వాగులో జాలర్లకు వలలో వింత చేప చిక్కింది. ఇది సాధారణ చేపల కంటే భిన్నంగా ఉండటంతో ఇది ఏ జాతికి చెందినదో గుర్తించలేకపోతున్నారు. అరుదైన ఈ చేపను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అరుదైన జాతి చేపగా భావిస్తున్నారు. ఇలాంటి చేప కనిపించడం ఇదే మొదటిసారని తెలిపారు.
PDPL: మంథని పట్టణంలోని రావులచెరువు కట్ట మహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం రూ. 82,653 వచ్చినట్లు ఆలయ ఈవో రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఈవో రాజకుమార్, ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆరు నెలలకు సంబంధించి ఈ ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రశాంత్, మహిళా భక్తులు పాల్గొన్నారు.