MBNR: జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ కాలనీకి చెందిన దాసు అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
GDWL: మల్దకల్ మండలం మద్దెలబండలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను చిన్న రథంపై ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.
GDWL: కేటిదొడ్డి మండలం ఇరికిచేడు గ్రామంలో వెలసిన సద్గురు తిక్క ఈరప్ప స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రథోత్సవాన్ని ఆయన ప్రారంభించారు.
MLG: మేడారం గుడి ప్రాంగణ నిర్మాణంపై గుంటూరు సతీష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను మేడారం ట్రస్టు బోర్డ్ ఛైర్మన్ సుకన్య-సునీల్ దొర తీవ్రంగా ఖండించారు.” రూ. 100 కోట్లు ఖర్చు చేసిన గుడి పనులను 200 కోట్ల స్కామ్‌గా చిత్రీకరించడం భ్రమ” అని ఎద్దేవా చేశారు. సతీష్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకోసారి విమర్శిస్తే ఊరుకోమన్నారు.
WGL: ఉమ్మడి జిల్లాలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి దశ జనగణన & ఇళ్ల గుర్తింపు సర్వేకు సిబ్బందిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేటర్‌ను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు సర్వేను సకాలంలో, సమర్థవంతంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
SRCL: వేములవాడలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సీతారాముల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సుందరంగా అలంకరించిన రథంపై సీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి, పట్టణ వీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, భజనలు, కోలాటాలతో పట్టణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ శుక్రవారం మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, ప్రాథమిక చికిత్స అందించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫుల్ మద్యం తాగి ఇంట్లో గొడవ కారణంగా ఈ చర్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
WNP: శ్రీరామనవమి పురస్కరించుకుని బోనమ్మ తండాలో సీతారాముల కళ్యాణోత్సవం బంజారా సంప్రదాయ వేషధారణలతో ఘనంగా జరిగింది. తండా మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజు, మోహన్ నాయక్ తదితర కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు.
KMR: రాజంపేట మండలంలోని కుమ్మరి కుంట ప్రాంతంలో పొలం పనుల్లో ఉన్న రైతులకు రెండు జింక పిల్లలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన రైతులు పుట్టా నర్సింలు, చింతల నరసింహులు, శ్రీను స్థానిక హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో ఆ జింక పిల్లలను సురక్షితంగా అటవీ శాఖ అధికారులకు అప్పగించి తమ ఉదారతను చాటుకున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా BJP రాష్ట్ర అధికార ప్రతినిధి, BJP జిల్లా అధ్యక్షులు నిషిధ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, మండల అధ్యక్షులు విష్ణు యాదవ్ ఉన్నారు.
MHBD: జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చ నాయక్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ శుక్రవారం గూడూరు మండలంలోని ఆయన నివాసానికి వెళ్లి లచ్చునాయక్ చిత్రపటానికి పూలుజల్లీ నివాళి అర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయనకి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
NLG: గుండ్లపల్లి(డిండి) మండల కేంద్రంలోని తైబజార్ వేలం పాటను ఈ నెల 30న పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి జంగయ్య తెలిపారు. ఆసక్తి గల వారు ముందస్తుగా రూ.5,500 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ ప్రణీతకు పదవి దక్కడం సంతోషంగా ఉందని కొత్తపల్లి(H) సర్పంచ్ చౌహన్ డిగంబర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ ఉన్నారు.
HNK: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుడైన తడక కరుణాకర్ (51) ఇంటి పై అంతస్తులో ఉండగా ఒక్కసారిగా కోతులు మీదకు రావడంతో భయంతో తప్పించుకోబోయి అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో కరుణాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు MGM ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం నగర అభివృద్ధికి ఆస్తి పన్నులే ప్రాణాధారమని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పన్ను చెల్లింపుదారులు తమ బకాయిలను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.