RR: మహేశ్వరం పరిధిలో ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ శ్రీదేవి అనే కానిస్టేబుల్ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం వాహనాలను ఆపి తనిఖీల పేరుతో నగదు వసూలు చేస్తున్నారని, అడిగినంత ఇవ్వకపోతే వాహనాలను సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
KNR: తమ సమస్యల పరిష్కారం కోసం ‘చలో అసెంబ్లీ’కి వెళ్తున్న జిల్లా ఆశా కార్యకర్తలను పోలీసులు రేణికుంట టోల్‌గేట్ వద్ద అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేసి వారిని అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శాంతియుత నిరసనను అడ్డుకోవడం అన్యాయమంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధకాండతో టోల్‌గేట్ పరిసరాల్లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.
NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూర్ చెక్‌పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు ప్లాస్టిక్ సేకరణ చేపట్టారు. వాహనాలను తనిఖీ చేస్తూ పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల రక్షణ కోసం అడవిలోకి ప్లాస్టిక్ తీసుకురావద్దని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.
BHPL: మహాముత్తారం మండల DTF నూతన కమిటీని రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా జాటోత్ రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా భాస్కర్, రత్నకుమారి, రాజేంద్రన్, తిరుపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. DTF సంఘం సమస్యలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
WGL: తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఉగాది పురస్కారాలకు WGL జిల్లా నుంచి ఉత్తమ భాషా పండితులను ఎంపిక చేసింది. ఖిలా WGLకు చెందిన నరేష్, నందిగామకు చెందిన అనురాధ, ఏనుగల్లుకు చెందిన మజాహార్, అభీదా తబస్సుమ్, షాహిన్, అనిత ఈ పురస్కారాలకు ఎంపికైనట్లు వారు వెల్లడించారు. రేపు HNKలో జరిగే పరాభవ ఉగాది వేడుకల్లో వీరికి అవార్డులు అందజేయనున్నారు.
SRD: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టుల వద్ద శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేశారు. మద్యం, గంజాయి, అక్రమ ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
HYD కేంద్రంగా CCMB సూపర్ బగ్స్‌పై కీలక అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా వ్యర్థ జలాలలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వ్యాప్తిపై తొలి సమగ్ర నివేదిక విడుదలైంది. నీటిలో యాంటీబయోటిక్స్ కలిపినప్పుడు బ్యాక్టీరియా జీన్స్ మార్పులతో గోడలను బలపరచడం, ఔషధాన్ని బయటకు త్రోసేయడం, నాశనం చేయడం ద్వారా ప్రతిఘటిస్తున్నట్లు గుర్తించారు. ఇది భవిష్యత్‌లో సవాలుకానుంది.
JGL: నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో మరణించిన పశువుల లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. బుగ్గారం సెక్షన్ పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అనిల్‌కు రూ.40 వేలు, గోపులాపూర్ గ్రామానికి చెందిన విజయకు రూ.40 వేలు, రాయపట్నంకి చెందిన సత్తయ్యకు రూ.40 వేలు, నక్కలపేటలోని గంగవ్వకు రూ.40 వేలు, గంగన్నకు రూ.7 వేల విలువైన చెక్కులను అందజేశారు.
WGL: చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఏసీపీ వాహనాన్ని అడ్డుకున్న ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జల్లి గ్రామానికి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంతో వారి బంధువులు, గ్రామస్థులు నిర్వహించిన నిరసనలో భాగంగా ఏసీపీ వాహనాన్ని అడ్డుకున్నమాజీ ఎంపీపీ అశోక్, సర్పంచ్ సుధాకర్ తదితరులపై కేసునమోదు చేశారు.
MDCL: మేడ్చల్ ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ, ఒంగోలు ప్రాంతాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నాయని డిపో మేనేజర్ పరిమళ తెలిపారు. రోజుకు మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకుని సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చన్నారు. వివరాలకు 9959226152, 9849737131 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
WNP: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా కొత్తకోట మండల పరిధిలో శ్రీ సీతారాముల వారి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో సీతారాముల ప్రతిమలను పల్లకిలో ఆశీనులు చేసి ప్రధాన వీధుల్లో ఊరేగించిన పల్లకి సేవ శ్రీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం సాగింది. ‘శ్రీ రామచంద్ర మూర్తికి జై’ అంటూ నినాదాలు చేశారు.
HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలను మరింతగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి ఇటీవల రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు భావితరాలకు నాణ్యమైన విద్య అందించడం, రైతులు, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రయోగశాలలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేశారు.
KMR: జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 525 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించింది. మొత్తం కేసుల్లో 56 మందికి జైలు శిక్షలు పడగా, 40 మందికి ఒక రోజు, నలుగురికి 2 రోజులు విధించారు
SRPT: కోదాడ పరిధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన షేక్ జైనిషా అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. తన యాక్టివా వాహనంపై మేళ్లచెరువు కోదాడ మండలం రామాపురానికి మద్యం తీసుకెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 18 బీర్ బాటిళ్లు, 47 క్వార్టర్ బాటిళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
NZB: జిల్లావ్యాప్తంగా నేడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని జిల్లాల న్యాయమూర్తులు తెలిపారు. చిన్న చిన్న కేసులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బును వృథా చేసుకోవద్దనన్నారు.