KMM: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారిక పర్యటన వాయిదా వేయడం జరిగిందిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ గమనించి సంతాప కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.
MBNR: భారతదేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందన్నారు.
SRD: కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం నాయకులు ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు. సీపీఎం రాష్ట్ర 4వ మహాసభల కోసం విరివిరిగా విరాళాలు సేకరిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు నిర్వహించే సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయాలని గ్రామస్తులను సీపీఎం నాయకులు కోరారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాకలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ముళ్లకంచెను అడ్డుగా వేశారని స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి పుష్కరవనం నుంచి వెళ్లే దారి ఉండగా అటువైపు నుంచి వెళ్లకుండా కంచె వేసి భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముళ్లకంచెను తొలగించి భక్తులకు దర్శనం కల్పించాలని కోరారు.
మెదక్: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన మరణం దేశానికి తీరని లోటని ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్: రేపు పాపన్నపేటలోని ఏడుపాయల దేవస్థానం నందు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు దేవస్థానం కార్యాలయం నందు టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. జనవరి 1 2025 నుంచి డిసెంబర్ 31 2025 వరకు దేవాలయంలో కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు కోసం స్టీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
NGKL: కల్వకుర్తి ప్రభుత్వ కూరగాయల మార్కెట్‌ను శుక్రవారం మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పండిత్ రావు తనిఖీ చేశారు. మార్కెట్ రికార్డులను పరిశీలించారు. మార్కెట్‌లో రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల అమ్మకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
WNP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఉపాధి పథకం, సమాచార హక్కు చట్టం సహా దేశ అత్యున్నత అనేక పదవులు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
SRD: పటాన్ చెరు మండలం పోచారం గ్రామ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
నల్గొండ: 17 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,111 మంది ఉద్యోగులు శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. సమగ్ర శిక్షఉద్యోగులు ఇవాళ నుంచి 100% సమ్మెలో పాల్గొంటామని ప్రకటించడంతో విద్యార్థుల పర్యవేక్షణతో పాటు పాఠాలు ఏర్పాట్లు చేసింది.
NLG: నకిరేకల్ మండలం నోముల మాజీ సర్పంచ్ సోమయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం సోమయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
KMM: మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాట్టా రాగమయి అన్నారు. ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్థికమేధావి మన్మోహన్ సింగ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
KMM: వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,000, కొత్త మిర్చి ధర రూ.16,011గా పలికింది. అలాగే, క్వింటా పత్తి ధర రూ.7,100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజూ కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.700, కొత్త మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.100 తగ్గినట్లు తెలిపారు.
HYD: ‘ఫేస్‌బుక్’ తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న ఆఫీస్ స్పేస్ కోసం నెలకు రూ.2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ.2.8కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించింది.