NRML: లోకేశ్వరం మండల కేంద్రంలో మండల మేరు సంఘం, యూనియన్ ఆధ్వర్యంలో శుక్లవారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రోజురోజుకు పెరిగి పోతున్న రేడిమేడ్ రంగం ప్రభావంతో మేర కులస్తులు, దీనిపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు.