NLG: దేవరకొండలోని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ సోషల్ మీడియా-యువ సమ్మేళనం విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ సైనికుల పాత్ర అమోఘమని, యువజన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరంతర శ్రమ, కృషి వల్లే ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.