AP: భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలు పడుతున్న ప్రాంతాల్లోని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.