W.G: నరసాపురంలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, గోడౌన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి జరుగుతున్నాయన్న ప్రభుత్వ అదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సీహెచ్ అజయ్ కుమార్ సింగ్ చెప్పారు.