ATP: అనంతపురంలో 30 ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిష్కారం చూపించారు. ఇటీవల చంద్రబాబు నగర్లో ఎమ్మెల్యే పర్యటించగా.. ఇంటి పక్కనే ట్రాన్స్ ఫార్మర్ ఉందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ ఫార్మర్తోపాటు విద్యుత్ లైన్లన్నీ మార్చడంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు.