ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో పాత కక్షల కారణంగా గురువారం ఆటో డ్రైవర్ జయరాముడుపై శ్రీనివాసులు అనే వ్యక్తి రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో జయరాముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.