TG: రాష్ట్రానికి వచ్చిన AICC అధ్యక్షుడు ఖర్గే ముందు కాంగ్రెస్ నేతలు పంచాయితీ పెట్టుకున్నారు. MLA ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని తిరస్కరించారు. ఆయనను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి తన కారులో తీసుకెళ్లారు. మరోవైపు MLA మల్ రెడ్డి.. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. HYD, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.