KDP: ఆత్మీయంగా జీవిద్దాం మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేద్దాం అని ఖాజీపేట CI మోహన్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఖాజీపేట మండలంలోని ముత్తులూరుపాడు గ్రామంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్యాక్షన్ కక్షల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో ‘మేలుకొలుపు’ నాటక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.