ASR: కొయ్యూరు మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో మంగళవారం వైద్య ఏర్పాటు చేశామని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. గ్రామంలో పలువురు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఓ చిన్నారి మృతి చెందింది. దీంతో పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, డౌనూరు పీహెచ్సీ, సచివాలయ వైద్య సిబ్బంది హుటాహుటిన జాజులబంధ గ్రామాన్ని సందర్శించారు. పలువురికి వైద్య సేవలు అందించామన్నారు.