KNR: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించామని అన్నారు. సైదాపూర్ మండలంలో సుమారు 30 వేల ఎకరాల భూమి ఉండగా అందులో సుమారు 29 వేల ఎకరాల సాగు భూమి ఉందని అన్నారు. అన్ని రకాల భూములు ఇక్కడ ఉన్నందున భూభారతి పైలట్ మండలంగా సైదాపూర్ను ఎంపిక చేసామని తెలిపారు.