SRPT: సూర్యాపేటలో దారుణ ఘటన జరిగింది. రాఘవపురానికి చెందిన అరుణ మూడోసారి గర్భం దాల్చింది. స్కానింగ్‌లో ఆడశిశువు ఉన్నట్లు గుర్తించి సూర్యాపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేసేందుకు ప్రయత్నం చేశారు. రక్తస్రావం తీవ్రమై పరిస్థితి విషమించగా ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం బయటకు రాకుండా బాధితులతో రూ.25లక్షలు నష్టపరిహారం ఒప్పుకున్నట్లు సమాచారం.