అన్నమయ్య: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం కడప-చెన్నై రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. కారులో వెళ్లేవారు సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.