భారత యువ ప్లేయర్లు గిల్, జైస్వాల్లపై క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రశంసలు కురిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 310/5 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఓపెనర్‌గా జైస్వాల్ దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడని కొనియాడాడు. అలాగే, గిల్ పూర్తి నియంత్రణతో ఆడి, సెంచరీ సాధించిన తీరు తనను ఆకట్టుకుందని సచిన్ పేర్కొన్నాడు.