VZM: స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 147 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు ఆగస్టు 15 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. మరుగుదొడ్లు నిర్మాణంపై బుధవారం ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మరో 74 కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.