KMM: బొగ్గు గనులు మూసేసిన ప్రాంతాల్లో అక్కడి ప్రజల జీవనోపాధికి ఏం చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. గనుల మూసివేత మార్గదర్శకాల ప్రకారం ప్రభావిత కుటుంబాల కోసం పునరావాసం చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అలాగే ఆ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు.