SKLM: గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పైడి కూర్మారావు బుధవారం తనిఖీ చేశారు. మందస మండలం కిల్లోయి కాలనీలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, వంట, భోజన గదులను త్రాగునీరు ఆర్వో ప్లాంట్ను కూడా పరిశీలించారు.