NLR; చేజర్ల మండలం ఏటూరు, నాగలవెల్లటూరులో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిణి P. హిమాబిందు మాట్లాడుతూ.. జీలుగ, జనము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలు సాగు చేయడంతో నేల సారాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. భూమి అనుకూలమైన పంటలు సాగు చేయాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.