JN: చేయూత పెన్షన్లలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో చేపట్టిన ముఖచిత్రం కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఇవాళ పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. కమిషనర్ రాధాకృష్ణ తదితరులున్నారు.