CTR: శాంతిపురం(M) 64 పెద్దూరులో మంచినీళ్ల కోసం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రామంలో నీళ్లు రాక తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకపోతే ఎలా అని మహిళలు ప్రశ్నించారు. నీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలతో నిరసన చేశారు.