AP: నంద్యాల జిల్లాలో బిచ్చగాళ్ల ముసుగులో క్రిమినల్స్ దందా చేస్తున్నారు. రైల్వే స్టేషన్లను షెల్టర్ జోన్లుగా వినియోగిస్తున్నారు. బిచ్చగాడు దస్తగిరి హత్య తర్వాత బిచ్చగాళ్లను పోలీసులు విచారించారు. 120మందిలో 30 మందికి నేర చరిత్ర ఉన్నట్లు నివేదికలో తేలింది. పోలీసులు వారి డేటాను సేకరించి, మందలించి పంపించారు. పోలీస్ పికెట్, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.