AP: రైతులను అన్ని విధాలా ఆదుకునేది కూటమి ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పంట దిగుబడి వచ్చిందని చెప్పారు. ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయన్నారు. మారిన అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించాలని సూచించారు. ఏ పంట పండిస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నట్లు తెలిపారు.